జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సర్వశక్తి’ని చేపట్టనుంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని రాజౌరీ పూంఛ్ సెక్టారులో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ అండ ఉన్న ఉగ్రమూకలు చెలరేగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా భద్రతా దళాలు పీర్ పంజాల్ పర్వత శ్రేణులతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమంతా ఉగ్రవాదుల ఆచూకీ కోసం సంయుక్తంగా గాలింపులు చేపడతాయని అధికారులు తెలిపారు.