తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు మొదలైయ్యాయి. భోగి సందర్భంగా వేకువజాము నుంచే పల్లె, పట్నం తేడా లేకుండా భోగి మంటలు వేశారు. భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు డీజే పాటలతో డ్యాన్స్ వేస్తూ సంబరాలు చేస్తున్నారు. ఇంట్లో పాత సమాను భోగి మంటల్లో వేసి తమ కష్టాలను తొలగించాలని అగ్నిదేవున్ని కొలుస్తున్నారు. అటు మహిళలు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి పండుగను అనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.