రూ.500 నోట్ల చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ఫేక్ క్యాంపెయిన్లు హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు చెల్లవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నక్షత్రం (*) గుర్తు ఉన్న రూ.500 నోట్లు 2016 నుంచి చలామణిలో ఉన్నాయని.. ఇవి నకిలీ నోట్లు కావని ఆర్బీఐ నిర్ధారించిందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్లపై ఆర్బీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *