హైదరాబాద్‌లో హోర్డింగ్‌లపై నిషేధం…జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

  హైదరాబాద్‌; వర్షాకాల సీజన్ సందర్భంగా జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు     గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని రకాల హోర్డింగ్‌లను నిషేధిస్తూ జీహెచ్ఎంసీ      నిర్ణయించింది. 

Image result for hoardings in hyderabad
వర్షాకాల సీజన్ సందర్భంగా జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని రకాల హోర్డింగ్‌లను నిషేధిస్తూ జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్ర‌స్తుత వ‌ర్షకాల సీజ‌న్‌తో పాటు ఆక‌స్మికంగా సంభ‌వించే విప‌త్తుల‌ను ఎదుర్కునేందుకు వివిధ శాఖ‌లు మ‌రింత స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మంగళవారం జ‌రిగిన స‌మావేశంలో ప‌లు శాఖ‌ల ఉన్న‌తాధికారులు నిర్ణ‌యించారు. వ‌ర్షాకాలంలో ఈదురుగాలులతో కూడిన వ‌ర్షాలు కురిసి హోర్డింగ్‌లు, యూనిఫోల్స్ కూలిపోయి ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉన్నందున జూన్ 15వ తేదీ నుండి ఆగ‌ష్టు 15వ తేదీ వ‌ర‌కు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని అన్ని ర‌కాల హోర్డింగ్‌లను నిషేధిస్తున్న‌ట్టు ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ అద్య‌క్ష‌త‌న వ‌ర్ష‌కాల విప‌త్తుల నివార‌ణ ప్ర‌ణాళిక‌పై నిర్వహించిన ఈ స‌మావేశానికి జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, రెవెన్యూ, ట్రాన్స్‌కో, మెట్రో రైలు, వాతావ‌ర‌ణ శాఖ నీటి పారుద‌ల శాఖ, ఫైర్ స‌ర్వీసులు, ఆర్టీసి, హైద‌రాబాద్, సైబ‌రాబాద్, రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ల అధికారులు హాజ‌ర‌య్యారు. హైద‌రాబాద్ మెట్రో రైలు ఎండి ఎన్‌.వి.ఎస్.రెడ్డి, హైద‌రాబాద్ ట్రాఫిక్ విభాగం అడిష‌న‌ల్ సిపి అనీల్‌కుమార్‌, సైబ‌రాబాద్ డిసిపి విజ‌య్‌కుమార్‌, హైద‌రాబాద్ జాయింట్ క‌లెక్ట‌ర్ ర‌వి, జీహెచ్ఎంసీ ఎన్‌పోర్స్‌మెంట్ విభాగం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంపాటి, త‌దిత‌రులు హాజరైన ఈ స‌మావేశంలో దాన‌కిషోర్ మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, మెట్రో రైలు, విద్యుత్, ఇత‌ర‌ విభాగాల వ‌ద్ద అన్ని క‌లిపి దాదాపు 300 విప‌త్తుల నివార‌ణ ప్ర‌త్యేక‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *