కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్య(Suriya) ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ ఏడాది ఈయన కరుప్పు, విశ్వనాథన్ అండ్ సన్స్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టారు. ఇక ఈ ఏడాదిలోనే సూర్య మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఆవేశం సినిమా డైరెక్టర్ జిత్తు మాధవన్ (Jithu Madhavan)దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం సీన్(Scene). ఈ సినిమా నవంబర్ 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే సుమారు 250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.2D ఎంటర్టైన్మెంట్, ఝగరం స్టూడియోస్ బ్యానర్లపై సూర్య జ్యోతిక ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సూర్య తన విచిత్రమైన ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరిచే డీఎస్పీ ఇన్బరాజ్ పాత్రలో నటించారు.
ఇలా సూర్య పాత్ర చాలా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో సూర్యకు జోడిగా నటి నజ్రియా నటించి సందడి చేశారు. ఇలా ఈ సినిమాకు పది రోజుల వ్యవధిలోనే సుమారు 250 కోట్ల కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమా కోసం డైరెక్టర్ జిత్తు మాధవన్ మొదటగా సూర్యుని ఎంపిక చేయలేదని సమాచారం. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం డైరెక్టర్ మొదట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ని అనుకున్నారట. ఈ కథ అల్లు అర్జున్ కు సరిగ్గా సూట్ అవుతుందని భావించిన జిత్తు మాధవన్ ఈ సినిమా కథను అల్లు అర్జున్ కు కూడా వివరించారని తెలుస్తోంది.
ఇలా అల్లు అర్జున్ కథ విన్న తర్వాత కథ మొత్తం ఆయనకు నచ్చినప్పటికీ డేట్స్ క్లాష్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ తన సినిమాలకు కమిట్ అయి బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలో సీన్ సినిమాని వదులుకున్నారని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన బన్నీ ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ సినిమా కనుక అల్లు అర్జున్ చేసి ఉంటే కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో మరో వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టి ఉండేది అంటూ వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. మరి ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే డైరెక్టర్ లేదా హీరో స్పందించాల్సి ఉంది.