ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల అక్రమాలపై ఎస్ఎఫ్ఐ పోరాటం…

మేడ్చల్ జిల్లాలో పలు విద్యాసంస్థలు తనికి బుక్కులు యూనిఫాంలు సీజ్.


మౌలాలి తులసి స్కూల్ ఎం ఈ ఓ బృందం  పుస్తకాల తరగతి సీజ్, దమ్మాయిగూడ excellencia కాలేజ్ తరగతుల బహిష్కరణ, ఈసీఐఎల్ మాస్టర్ మైండ్ స్కూల్ ముందు ధర్నా.


ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ….



కాప్రా  మండలం లోని అనేక స్కూళ్లలో పుస్తకాలు విచ్చలవిడిగా యాజమాన్యాలు ధరలు పెట్టుకొని తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇంత కూడా స్పందించకుండా విద్యాధికారులు ప్రైవేటు యాజమాన్యాలకు అమ్ముడు పోతున్నారు ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలపై చర్యలు తీసుకోలేదు, అనుమతి లేని పాఠశాలలో బహిరంగంగా నడుపుతుంటే ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అంతేకాకుండా పుస్తకాల విక్రయాల్లో ప్రభుత్వ ధరల కంటే నాలుగింతలు ధరలు పెంచి తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి ప్రైవేటు యాజమాన్యాలు వారి యొక్క అసోసియేషన్ లో దోపిడీ చేసుకోవడం కోసమే ఉన్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మేమున్నామని తెలియజేస్తున్నాము జిల్లా అధికారులు మండల అధికారులు తెరాస ప్రభుత్వం నిద్రనుంచి మేలుకొని ఇకనైనా స్పందించాలని మోసపోతున్న తల్లిదండ్రులను విద్యార్థులను కాపాడాలని, అనుమతిలేని excellencia కాలేజీలో పిల్లలను చేర్పించే వద్దని విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దని తల్లిదండ్రులను కోరుతున్నాము.

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు పడాల శంకర్ నాయకులు సాయి అఖిల అస్లాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *