ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రవాప్తంగా అన్ని రకాల థియేటర్లలో టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులు వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ లలో రూ.65 రూపాయలు , మల్టీ ప్లెక్స్ లలో రూ.100 పెంచేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదిన గుంటూరు కారం సినిమా విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.