దాదాపు రామాయణం కథ ఇది అని మన అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో వెర్షన్ లో మొదటి పార్ట్ వరకు కథ ఏంటో చూద్దాం.. లంక లోని అసుర సామ్రాజ్యాన్ని ఇంద్రుడు (కునాల్ కపూర్) తన దేవతల సమహారంతో భీకర యుద్ధం చేసి సొంతం చేసుకొని ఆ బాధ్యతను కుబేరునికి అప్పగిస్తాడు. కానీ అది ఎప్పటికీ తమ సామ్రాజ్యమే అని దశాసణుడుగా పిలవబడే రావణుడు (యష్) తల్లి కైకేసి (శోభన) తన కొడుకును బ్రహ్మ అనుగ్రహ తపస్సుకు ఉసిగొల్పి మళ్లీ తమ అసుర జాతికి పూర్వ వైభవం తీసుకురావాలని మాట తీసుకుంటుంది. ఇలా దీనితో కఠోరమైన తపస్సు చేసి తన మరణాన్ని తనే శాసించుకునే వరాన్ని రావణుడు బ్రహ్మ నుంచి సొంతం చేసుకుంటాడు. ఇక అక్కడ నుంచి రావణుడు అకృత్యాలు మొదలవుతాయి. ఈ క్రమంలో ఇంద్రుడు విష్ణు మూర్తిని శరణు వేడిన పిదప అయోధ్యలో రాముడు (రణబీర్ కపూర్) పుట్టుక తదుపరి ఎలాంటి పరిణామాలు తన సీత (సాయి పల్లవి), సోదరుడు లక్ష్మణుడు (రవి దూబే) లతో 14 ఏళ్ళు వనవాసానికి వెళతారు. ఈ తర్వాత సీత అపహరణకి కారణం ఏంటి? అక్కడ నుంచి నిస్సహాయతలో ఉన్న రాముడు ఎదుట ఉన్న మరిన్ని కఠిన సవాళ్లు ఏమిటి? అనేవి ఈ భాగంలో కథ. సో అవేంటి అనేవి తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో బాగా మెప్పించే అంశం ఏదైనా ఉంది అంటే.. రామాయణ, భారతం వంటివి ఎన్నిసార్లు విన్నా, చూసినా ఏదొక కొత్తదనం ఉంటుంది అని నానుడి ఉంది. అది మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో దాదాపు చాలా మందికి పైపైన మాత్రమే తెలిసిన కొన్ని విషయాలని దర్శకుడు చాలా శ్రద్ధగా, డీటైలింగ్ గా వివరించడం అనేది ఇంప్రెస్ చేస్తుంది.
తరువాత జరగనున్న ఓ కీలక ఘట్టానికి కారణాన్ని అలా బిల్డ్ చేస్తూ వివరించడం ఇందులో బాగుంది. అలానే ఆ సన్నివేశాలు కూడా సినిమాలో కొత్తగా అనిపిస్తాయి. ఇక దీనితో పాటుగా ఇందులోని భావోద్వేగం చూసే ప్రేక్షకులని కదిలిస్తుంది. ఫస్టాఫ్ ఆయితే ఈ ఎమోషన్స్, గ్రాండ్ విజువల్స్ ఇంకా యాక్షన్ పార్ట్ పార్ట్ తో ఒక పూర్తి ప్యాకెజ్ గా ఓ రేంజ్ లో ట్రీట్ అని అందిస్తుంది.
రామాయణం అనే మహత్తరమైన కథను చెప్పడానికి తీసుకున్న భారీతనం ఇందులో మెప్పిస్తుంది. అలానే సెకాండాఫ్ లో మరికొన్ని సన్నివేశాలు, రావణ జటాయువు నడుమ భీకర యుద్ధ సన్నివేశాలు కట్టిపడేసే విధంగా అనిపిస్తాయి. ఇక నటీనటులు పరంగా కూడా సినిమాలో చాలా కేర్ కనిపిస్తుంది. మొదట రామునిగా కనిపించిన రణబీర్ కపూర్ నుంచే చూసుకుంటే రణబీర్ రామునిలోని తేజస్సుని, వినయ విధేయతలను చక్కగా తన హావభావాలతో వ్యక్తపరిచాడు. అలానే తన పాత్రలోని లోతు, అందుకు సంబంధించిన పలు సన్నివేశాలు ఇందులో చాలా బాగున్నాయి.
అలాగే సాయి పల్లవి తన పాత్రలో అంతే ఒదిగిపోయింది. ఇద్దరి నడుమ సన్నివేశాలు ముచ్చటగా కనిపిస్తాయి. అలానే ఆమె తన పాత్రలోని పలు కోణాలని కూడా అద్భుతంగా పండించింది. ఇక రావణ పాత్రలో యష్ జీవించాడు. తన కెరీర్ లో నటుడుగా గత సినిమా టాక్సిక్ లో ఎలా అయితే ఆశ్చర్యపరిచాడో ఈ సినిమాలో అంతకు మించి ఆశ్చరపరుస్తాడు. తన మేకోవర్ డెడికేషన్ గాని పది తలల రావణునిగా పది రకాల రావణునిగా కూడా భిన్నమైన షేడ్స్ చూపించి ఆశ్చర్య పరిచాడు.
ఇక లక్ష్మణ పాత్రలో రవి దూబే బాగా చేసాడు. తన పాత్రలోని ఆవేశం, దూకుడు స్వభావం అన్న పట్ల వాత్సల్యాన్ని బాగా ప్రదర్శించాడు. అలానే అక్కడక్కడా మంచి హాస్యన్ని కూడా అందించాడు. ఇక వీరితో పాటుగా వివేక్ ఓబెరాయ్, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ఇతర నటీనటులు అంతా తమ పాత్రల్లో సరిగా సెట్ అయ్యి వారి పాత్రలకి పూర్తి శాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రాన్ని భాగాలుగా విభజించి ప్లాన్ చేసుకున్న క్రమంలో పార్ట్ 2 కి కావాల్సిన డ్రామాని పార్ట్ 1 సెకండాఫ్ లో మరికాస్త ఎంగేజింగ్ గా మలచాల్సింది. ముగింపు మరింత బలంగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలానే ఈ సినిమా బడ్జెట్ పరంగా విజువల్స్ కి పెద్ద పీఠ వేశారు.
అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పూర్తి స్థాయిలో విజువల్ ట్రీట్, ఎక్కడా గ్రాఫిక్స్ డిజప్పాయింట్ చేయవు భారతీయ సినిమా నుంచి ఒక పూర్తి స్థాయి విజువల్ వండర్ ని చూస్తున్నాము అనుకునేవారు కొంచెం అంచనాలు తక్కువ పెట్టుకోవాలి. మిగతా పోర్షన్స్ అంతా బాగానే ఉన్నాయి కానీ అసురుల పోర్షన్స్ లో గ్రాఫిక్స్ వీక్ గా ఉన్నాయి. కుంభకర్ణుడు తదితర భారీకాయంతో కూడిన పాత్రల్లో జీవం కనపడలేదు. అలాగే సెకండాఫ్ కొద్దిగా నెమ్మదించింది. పలు పోర్షన్స్ నెమ్మదిగా సాగాయి. పైగా ఏ ఐ తో చేసిన లిప్ సింక్ చాలా చోట్ల అసహజంగా అనిపించింది.
సాంకేతిక వర్గం:
నిర్మాణ విలువలు పరంగా రామాయణ మేకర్స్ ఎక్కడా తగ్గలేదు. ఈ పురాణ గాథను చెప్పడానికి చేసిన ఖర్చు, ప్రతీ పైసా మనకి తెరపై మంచి క్వాలిటీతో కనిపిస్తుంది. కేవలం కొన్ని పోర్షన్స్ వి ఎఫ్ ఎక్స్ ని మెరుగ్గా చేయాల్సింది. మిగతా సినిమా అంతా గ్రాండ్ విజువల్స్ తో ఆశ్చర్యపరుస్తుంది. రెహమాన్, హన్స్ జిమ్మర్ ల సంగీతం సినిమాలో మరో పెద్ద ఎసెట్ గా నిలిచింది. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ సెకండాఫ్ కొంచెం బెటర్ చేయాల్సింది.
ఇక దర్శకుడు నితీష్ తివారి విషయానికి వస్తే.. ఘంటసాల వర్క్ ఈ పార్ట్ వరకు మెప్పిస్తుంది. సినిమాలో సోల్ ని దెబ్బ తీయకుండా అద్భుతమైన ఎమోషన్స్ ని తను పండించారు. యాక్షన్ సీక్వెన్స్ లు, గ్రాండియర్ లో తన విజన్ అద్భుతం. స్క్రీన్ ప్లే కూడా బాగా ప్లాన్ చేసుకున్నారు. డైలాగ్స్, చాలా బాగున్నాయి. తన డీటైలింగ్ కథనం ఇందులో బాగుంది. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు మరికాస్త బెటర్ గా చేయాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘రామాయణ పార్ట్ 1’ అద్భుతమైన ఎమోషన్స్, గ్రాండ్ విజువల్స్ అలాగే మంచి యాక్షన్ ఎలిమెంట్స్ తో సాగే అద్భుతమైన దృశ కావ్యంగా నిలిచింది. ఇది వరకు చూసిన రామాయణ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కూడా పలు కొత్త విషయాలు, పరిస్థితులు చూపించి రక్తి కట్టించింది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ తదితరులు ప్రధాన తారాగణం ఈ భారీ సినిమాలో భాగం అయ్యి సినిమాకి అదనపు బలం చేకూర్చారు. దర్శకుడు నితీష్ తివారి కథనం, విజన్ లు ఈ సినిమాని మరొస్థాయిలోకి తీసుకెళ్ళాయి. అలాగే రెహమాన్, జిమ్మర్ ల సంగీతం ఈ సినిమాని మరింత ఎఫెక్టీవ్ గా మార్చేసింది. కొన్ని వి ఎఫ్ ఎక్స్ పోర్షన్ లు, కొన్ని స్లో సీన్స్ పక్కన పెడితే ఈ చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్ లో మాత్రమే చూసి ఆస్వాదించాలి. ముఖ్యంగా 3D లో అయితే ఆ అనుభూతి మరింత బిగ్గరగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మీ టికెట్లు బుక్ చేసుకొని కుటుంబ సమేతంగా థియేటర్స్ లో చూసేయ్యండి.