త్వరలో నూతన విద్యుత్ విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సెంబ్లీలో చర్చించి సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
తెలంగాణ సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. సంబంధిత శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం, డిస్కంల పనితీరుపై సీఎం చర్చించారు. సంబంధింత అంశాలపై ఆరా తీశారు.
అలాగే సీఎం రేవంత్‌రెడ్డితో అమెజాన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.