కర్నూలు జిల్లాలో రీపోలింగ్‌కు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు జిల్లా కోసిగి జడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం తిరిగి మళ్లీ నిర్వహించాలన తెలిపింది. దీంతో కోసిగి మండలం అర్లబండ గ్రామంలోని పోలింగ్ కేంద్రం నంబర్-2లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
అయితే నవంబర్ 5న మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలింగ్ కేంద్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఆక్రమించారు. బలవంతంగా బ్యాలెట్ పత్రాలపై ఓట్లు వేసి బ్యాలెట్ బాక్సులో వేసినట్లు కలెక్టర్ నివేదికలో అధికారులు పేర్కోన్నారు. దీంతో బూత్ క్యాప్చరింగ్ ఘటనతో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా కలుషితమైందని ఎస్‌ఈసీ నిర్ధారణ చేసింది. ఈ సంఘటనతో అర్లబండ పోలింగ్ కేంద్రం-2లో నవంబర్ 5న జరిగిన పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తిరిగి పోలింగ్ నర్వహించనున్నారు. దీనికోసం ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి చెరగని సిరా గుర్తు వేయాలని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. రీపోలింగ్‌పై ఓటర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులకు విస్తృత ప్రచారం ద్వారా సమాచారం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఆర్టికల్ 243K, ఏపీ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 231 ప్రకారం ఎస్‌ఈసీ నిర్ణయం ప్రకారం రీపోలింగ్‌కు ఆదేశిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.