దేశ చరిత్రలో ఇలాంటి ఘోరమైన ఎన్నికలు ఎక్కడ జరిగి ఉండవు అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జటన్ అన్నారు. ఎన్నికల పక్రియను కబ్జా చేసి ఎన్నికలు జరిపారుని అన్నారు. ఎన్నికల వ్యవస్థను హైజాక్ చేసి పక్రియ జరిపారు. ఎన్నికల పక్రియలో చంద్రబాబు శకుని పాత్ర పోషించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసారని ఫైర్ అయ్యారు. అసలు ఇవి ఎలక్షన్స్ ఆ…? సెలక్షన్స్ ఆ…? ఇంతలా దుర్మార్గాలు చేసి ఎన్నికలు జరపడం దేనికి..? ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు కనుకే ఫెయిర్ ఎన్నికలు వెళ్లే దమ్ము ధైర్యం లేదని గాటు వ్యాఖ్యలు చేశారు.
స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే చంద్రబాబు దిమ్మతిరగడం ఖాయం అని ఆయనకి తెలుసు.. కాబట్టే ఈ ఎన్నికల్లో పోలీసు వ్యవస్థ దారుణంగా దిగజారిపోయిందని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గూండాలతో పోలీసులు కుమ్మక్కు అవ్వడం సిగ్గుచేటు అని, అందరూ మాఫియా ముఠాలా ఏర్పడి ఎన్నికల వ్యవస్థను గుప్పెట్లోకి తీసుకున్నారని అన్నారు sec చంద్రబాబు తొత్తుగా మారి ఎన్నికలు జరిపారని అన్నారు. ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఈ ఎన్నికల చూస్తే ఎవరికైనా అనిపిస్తుందని జగన్ అన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీల నామినేషన్ వెయ్యకుండా అడ్డుకోవడం చూసామా..? పోటీ లేనప్పుడు ఎలక్షన్ ఎలా అవుతుంది..? సెలక్షన్ మాత్రమే అవుతుందని అన్నారు.
సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా వీళ్ళకి బుద్ధిరాలేదని ఫైర్ అయ్యారు. ధైర్యం చేసి నామినేషన్ వేస్తే కావాలని రిజెక్ట్ చెయ్యడం ఏంటి..? పోలింగ్ అర్జెంటులు లేకుండా స్వేచ్ఛా రిగ్గింగ్ చేసేసుకున్నారు. 84 zptc స్థానాలు నామినేషన్ వెయ్యకుండా అడ్డుకున్నారని జగన్ అన్నారు. 2109 mptc స్థానాల్లో పోటీ లేకుండా నామినేషన్ వెయ్యనివ్వలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను బేకాతరు చేశారని అన్నారు. పోలింగ్ రిగ్గింగ్, బ్యాలెట్ బాక్స్ లు రిగ్గింగ్, చివరికి పలితాలు రిగ్గింగ్ అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రిగ్గింగ్ కోసం ట్రైనింగ్..
రిగ్గింగ్ కోసం ట్రైనింగ్ ఇచ్చి టీడీపీ గూండాలను బూతుల్లోకి వదిలారు. ఎన్నికల రిగ్గింగ్ లో చంద్రబాబు phd చేసాడని జగన్ అన్నారు. దొంగ ఓట్స్ వెయ్యడం ప్రాక్టీస్ చేయించి పంపించారని, ఇచ్చాపురం నుండి కుప్పం వరకూ యదేచ్ఛగా రిగ్గింగ్ చేసేసారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఓటర్ లిస్ట్ కంటే పోలైన ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయి..? పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో వేల సంఖ్యలో ఓట్లు ఎలా పెరిగాయి..? విశాఖ కార్పొరేషన్ లో లక్ష 15 వేల ఓట్లు ఎలా పెరిగాయని జగన్ ప్రశ్నించారు.
మా వాళ్ళు ధర్నాలు చేసేవరకూ స్ట్రాంగ్ రూమ్స్‌కి షీల్ వెయ్యలేదు. పోలింగ్ పర్సంటేజ్ ఇష్టానుసారం పెంచేసి తప్పుడు లెక్కలు చూపించారని జగన్ ఫైర్ అయ్యారు. ఎన్నికలు సజావుగా సాగితే చంద్రబాబు ఎలా గెలుస్తాడు..? మూడేళ్లలో చంద్రబాబు ఏం చేశాడని ప్రజలు ఆయనకి ఓటు వేస్తారు..? ప్రజలు ఓట్లు వెయ్యరని తెలిసి దౌర్జన్యాలు చేసి రిగ్గింగ్ చేసేసారు అని వైఎస్ జగన్ అన్నారు.