శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్, హిట్ 2’ సీక్వెల్ సినిమాలు ఎంత పెద్ద హిట్ కొట్టాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘హిట్ 3’లో నాని హీరోగా ఉండనున్నట్లు హిట్ 2లోనే చెప్పేశాడు. ప్రస్తుతం కొలను శైలేష్. హీరో వెంకటేశ్‌తో కలిసి ‘సైంధవ్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 13న మూవీ విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో శైలేష్ ‘హిట్ 3’ అప్‌డేట్ ఇచ్చారు. స్క్రిప్ట్ రెడీ చెయ్యాలని, త్వరలోనే మూవీ అప్‌డేట్ ఇస్తానని ఆయన తెలిపారు.