చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా వాయిదా వేసింది. తాజాగా ప్రయోగించిన ల్యాండర్ వైఫల్యమే దీనికి కారణంగా తెలుస్తోంది. 50ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనుషులను పంపించే ఆర్టెమిస్-3 యాత్ర 2026కు వాయిదా వేసింది. ఈ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములను చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపించాలని నాసా సన్నాహాలు చేస్తోంది.