ఇటీవలే వైసీపీకి దూరమైన అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్, అంబటి రాయుడు కలిసున్న ఫోటోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసి.. ప్రస్తుతం ఈ టీమ్‌లో ఆడుతున్నాడు అని రాసుకొచ్చారు.