ఎస్‌ఐ ప్రియాంక వేటుపై..! సోషల్ మీడియాలో విడదల రజిని పోస్ట్..

నాకు జరిగిన అన్యాయంపై గళమెత్తిన నెటిజన్లకు ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ పార్టీ మాజీ మంత్రి విడదల రిజిని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య హక్కులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని రజిని అన్నారు. రాజకీయ నేతలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

ప్రజల భిన్నాభిప్రాయాలను అణచివేస్తే ప్రజాస్వామ్యం పేరుకే పరిమితమవుతుందని రజిని అన్నారు. ఇక నైనా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని, చట్టబద్ధ పాలన కొనసాగాలని విడదల రజిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని రజిని విజ్ఞప్తిచేశారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజీ పడకూడదని వ్యాఖ్యానించారు.

పల్నాడు జిల్లా ఎస్‌ఐ ప్రియాంకపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీంతో వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి విడదల రజినిపై పోలీస్ అధికారి దురుసు ప్రవర్తనపై విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, కాలపరిమితితో విచారణ చేపట్టాలని అధికారులకు ఏన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసారు. దీంతో ఎస్‌ఐ ప్రియాంకను ఎన్నికల విధులతో పాటు సాధారణ విధుల నుంచి తక్షణమే తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది.