శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ (Varun Sandesh)శ్వేతా బసు ప్రసాద్(Swetha Basu Prasad) నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం కొత్త బంగారులోకం(Kotha Bangarulokam). 2008వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ సందేశ్ శ్వేతా బసు ప్రసాద్ సైతం పలు సినిమాలలో నటించారు కానీ తదుపరి సక్సెస్ రాకపోవడంతో వీరిద్దరూ ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యారు. వరుణ్ సందేశ్ పలు సినిమాలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇకపోతే వరుణ్ సందేశ్ శ్వేతా బసు ప్రసాద్ దాదాపు 18 సంవత్సరాల తర్వాత మరోసారి జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో నా వైఫ్ మిస్సింగ్(Naa Wife Missing) అనే సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ ఆహాలో ప్రసారమవుతుంది. నేడు ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడంతో చిత్ర బృందం ఒక ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొత్త బంగారులోకం సినిమా సీక్వెల్(Kotha Bangarlokam 2) గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. చాలా సంవత్సరాల తర్వాత వరుణ్ సందేశ్ శ్వేతా బసు ప్రసాద్ జంటగా ఆ వైఫ్ మిస్సింగ్ అనే సిరీస్ లో నటించడంతో కొత్త బంగారులోకం సీక్వెల్ కూడా వచ్చే ఆలోచనలో ఉందా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా కొత్త బంగారులోకం సీక్వెల్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురవడంతో వరుణ్ సందేశ్ స్పందిస్తూ ఈ సినిమా సీక్వెల్ గురించి తాను డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తో ఒకసారి మాట్లాడానని తెలిపారు. అయితే శ్రీకాంత్ అడ్డాల ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. కొత్త బంగారులోకం సినిమా అక్కడితోనే అయిపోయింది.. మరి ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు అంటూ వరుణ్ సందేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా కొత్త బంగారులోకం గురించి వరుణ్ సందేశ్ చేసిన ఈ కామెంట్స్ బట్టి చూస్తుంటే ఇకపై ఈ సినిమా సీక్వెల్ రాదని తెలుస్తుంది.
బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు (వరుణ్ సందేశ్) తన భార్య స్వప్న (శ్వేతా బసు ప్రసాద్) కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. భార్య అదృశ్యమైన ఒక రోజు తర్వాత ఫిర్యాదు చేయడంతో పోలీసులకు బాలుపై అనుమానం కలుగుతుంది. మరి ఈ మిస్టరీ మిస్సింగ్ వెనుక ఉన్న కథ ఏంటి నిజంగానే స్వప్న కనిపించకపోవడం వెనుక తన భర్త బాలు హస్తం ఉందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ కు స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించగా, లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై శివ కంఠంనేని నిర్మించారు.