2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ భహిరంగ సభ..! మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..!

ఏఐసీసీలో జరిగిన మార్చ్ తరహాలోనే త్వరలో హైదరాబాద్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నామని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 2 లక్షల మందితో భారీ సభకు ప్లాన్ చేస్తున్నామని, ఇందిరా గాంధీ స్టాచు వయ పరేడ్ గ్రౌండ్ వరకు భారీగా ర్యాలీ తీయాలని అనుకుంటున్నామని దీనిని సీఎం ఫైనల్ చెయ్యాలని అన్నారు. జనాలు ఫ్రీగా వాక్ చేసేలా ప్లాన్ చేస్తున్నాంమన్నారు. ఒక వేల ర్యాలీ ఉంటే ఆ రూట్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటాయని, దీనికోసం దసరా తర్వాత డేట్ ఫైనల్ చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.ఏఐసీసీ ఇతర రాష్ట్రాల్లో ర్యాలీ సభ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో సభ ఏర్పాటు చేయాలనేది ఫైనల్ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సౌత్ లో ఇంకో రాష్ట్రంలో కూడా ఉంటుందిని అన్నారు.

Rtc ఎన్నికలు పెట్టాలని పెట్టాంమని, పార్టీ సింబల్‌తో జరిగిన ఎన్నికలు కాదు. ఓటమికి రకరకాలుగా కారణాలు ఉన్నాయని అన్నారు. మా ఎమ్మెల్యేలే యూనియన్‌లలో గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. కార్మికులకు న్యాయం జరగాలి అనేదే మా లక్ష్యం అని పీసీసీ అన్నారు. ఎన్నికలు మాకు ముఖ్యం కాదు సంస్థను బలోపేతం చేయడమే ముఖ్య ఉదేశ్యమని, గ్రాడ్యుయేట్ Mlc ఎన్నికల గెలుపు పై వరుసగా సమావేశాలు ఉన్నాయని అన్నారు. Mchrd లో బోది పెవిలియన్ లో సీఎంతో భేటీ ఉంటుందని అన్నారు.

రాహుల్ గాంధీ పై తప్పుడు ఆరోపణలు చిల్లర ఆరోపణలు చేశారు. మహిళ జర్నలిస్టుల పై దాడి అంటూ చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని, Dk శివకుమార్ ని నెట్టలేదు వెనక్కి రమ్మని పిలిచారని, వీడియోస్‌లో స్పష్టంగా ఉంది అసలేం జరిగిందో అని అన్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే షూ లెస్ లూజ్ అయితే లేస్ టైట్ చేశారు రాహుల్ గాంధీ.. మోడీ ఎంత మందిని అనగతొక్కలేదు. జంతర్ మంతర్ తెస్తాం అన్నాం తెచ్చామని, నిరసన తెలిపే హక్కు కాలరాస్తాం అంటే ఊరుకొమని అన్నారు. కేసీఆర్ ధర్నా చౌక్ ఎత్తివేస్తే రాష్ట్రంలో ఓడిపోయారు. అక్కడ మోదీ జంతర్ మంతర్ తీసేసారు కేంద్రంలో ఓడిపోవడం పక్కా అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

బీఆర్ఎస్ బాగోతం అంతా కవిత బయటపెడుతుంది. హరీష్ రావు, సంతోష్ రావు కేటీఆర్ పై నిజాలు కవిత మాట్లాడుతుందని అన్నారు. వాటికి సమాధానం చెప్పాలని, కవిత మాట్లాడిన మాటలను ప్రజలు సైతం నమ్ముతున్నారని అన్నారు. బిఅరెస్ నాయకుల ఫార్మ్ హౌజ్ ల బాగోతం ప్రజలకు తెలిసిందని, మేజర్ నాయకుల ఫార్మ్ హౌజ్‌ల వద్దకు మా నేతల బృందం వెళ్ళిందని అన్నారు. ఫార్మ్ హౌజ్‌ల పై దాడి చేయడం మా ఇంటెన్షన్ కాదు.. మతాల పై చిచ్చు పెట్టె పార్టీ బీఆర్ఎస్ దేవుల్లను సమర్ధిస్తే తప్పేమీ లేదని అన్నారు. లౌకికవాదం ఉన్న ప్రాంతాల్లో ఓట్లను SIR తో తొలగిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక చాలు మోదీ నీ మోసాలు చాలు అంటున్నారు. బిజెపి నాయకత్వంలో ఇప్పటికే దేశం ప్రమాదంలో ఉందని అన్నారు.