సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఖరారు అయ్యింది. దావోస్, లండన్ లో ఈ నెల 15 నుంచి 20 వరకు రేవంత్ పర్యటన సాగనుంది. దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు. దావోస్ సదస్సులో భాగంగా ప్రముఖ ప్రపంచ కంపెనీలకు చెందిన సిఇవోలు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు