ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారందరికీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా , వారంతా కరోనా నెగటివ్ గా తేలారు అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది . ఎయిర్‌పోర్టు అథారిటీ ఇచ్చిన సమాచారం ఆధారంగా విదేశాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నార నేది రాష్ట్ర ప్రభుత్వం జల్లెడ పట్టింది. పట్టణాలు, గ్రామాల్లో వలంటీర్ల సాయంతో ఇంటింటా సర్వే నిర్వహించి ఎన్‌ఆర్‌ఐల చిరునామాలను గుర్తిం చారు. వారందరినీ ఆస్పత్రి క్వారంటైన్, హోం క్వారంటైన్లకు తరలించారు. వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడి సంతోషంగా ఉన్నారు. తమ ద్వారా రాష్ట్రానికి కరోనా వస్తుందనే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మొదట భయపడినా.. ప్రభుత్వం అందించిన వైద్యంతో క్షేమంగా బయట పడ్డామని ఎన్‌ఆర్‌ఐలు చెబుతున్నారు.