మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు..! మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్..

మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయంతోపాటు ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి కలిపి రూ.1100 కోట్లకు పైగానే అనుమతులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై పనులు జోరందుకోనున్నాయి.

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు
రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్‌ఫ్రంట్‌ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర స్వామి ఆలయం అభివృద్ధితోపాటు ఆరు లేన్ల రహదారికి సుమారం రూ.1,108.27 కోట్లకు అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు G.O నెంబర్ 928 ను విడుదల చేసింది.  గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులకు రూ.948.65 కోట్లు కేటాయించింది. ఆలయ సముదాయంలో రాజ గోపురాలు, యాగశాల, పుష్కరిణి వంటివి నిర్మాణాలు చేయనున్నారు.ఆ ప్రాంతంలో ఆరు లేన్ల రహదారి కోసం మరో రూ.159.62 కోట్లు కేటాయించింది. 30 మీటర్లు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించనుంది. ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు దాదాపు 2.50 కిలోమీటర్ల మేరా నిర్మించనున్నారు. ఈ రహదారి గ్రేహౌండ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలకు అనుసంధానం జరగనుంది. మూసీ రివర్‌ఫ్రంట్ రోడ్ నెట్‌వర్క్‌తో ఓంకారేశ్వర ఆలయ సముదాయానికి కనెక్టివిటీ కల్పించనున్నారు. ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధికి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.రూ.700 కోట్లతో ఆలయ ప్రాజెక్ట్‌కు ఈ కమిటీ సాంకేతిక మార్గ దర్శకత్వం అందించనుంది. డిజైన్లు, డీపీఆర్‌లు, రేట్లు, టెండర్లపై కీలక పాత్ర. ఈ కమిటీలో ఆర్‌ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్- కో-చైర్మన్‌గా ఉండనున్నారు. MRDCL చీఫ్ ఇంజనీర్-కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఎండోమెంట్స్ చీఫ్ ఇంజనీర్, ఆలయ ఆర్కిటెక్చర్ నిపుణుడు శివనాగిరెడ్డి, ఫైనాన్స్ శాఖ అదనపు కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలు, నిర్మాణ పనులు, మౌలిక వసతులపై టెక్నికల్ కమిటీ పర్యవేక్షణ ఉండనుంది.