మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు వరకు జరిగే మహా జాతరకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. మేడారంలో భక్తుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్త్ మినిస్టర్ రాజనర్సింహా ఆరోగ్యశాఖ, ట్రైబల్ వెల్ఫేర్ విభాగాల ఉన్నతాధికారులతో సోమవారం రివ్యూ నిర్వహించారు. 50 బెడ్ల కెపాసిటీతో తాత్కాలికంగా స్పెషలిటీ హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. 72 మెడికల్ క్యాంపులు, 20 మొబైల్ మెడికల్ యూనిట్లు, 15 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని సూచించారు.