ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా జనవరి 7వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 682కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. కర్ణాటకలో 199, కేరళలో 148, మహారాష్ట్రలో 139, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఏపిలో 30, రాజస్థాన్‌లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 21, ఒడిశాలో మూడు, తెలంగాణలో రెండు, హర్యానాలో ఒక కేసు నమోదైంది