రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. వరంగల్ ఖమ్మం నల్గొండ కు సర్వోత్తం రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామా రామ్మోహన్ రెడ్డి పేరును అదిష్టానం ఖరారు చేసింది. నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మళ్ళీ ఖార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు సామా రామ్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్టీని నమ్ముకుని కష్ట పడితే అవకాశలు వస్తాయానడానికి ఇది నిదర్శనం అని ఆయన అన్నారు.
పార్టీ కోసం సమయం వెచ్చిస్తే కాంగ్రెస్ మనల్ని వదులుకోదని, అతి పిన్న వయస్కుడిగా కాంగ్రెస్ నాకు అవకాశం ఇచ్చిందని అన్నారు. యువతకు ప్రాధాన్య ఇవ్వాలని అవకాశం ఇచ్చారని, నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటా అని సామా రామ్మహన్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఏమి చేసింది. ఈ ప్రభుత్వం ఏమి చేసింది బేరీజు వేసుకుంటే తెల్సుతుందని, నీ మనుమడు, నా మనుమడు ఒక్కటే అని కేసీఆర్ అన్నడు. జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితికి రాష్ట్రాన్ని Brs ప్రభుత్వం తీసుకెళ్లిందిని అన్నారు. కలం పట్టుకునే విద్యార్థుల తో చీపుర్ల పట్టించారు. పది సంవత్సరాలలో నెత్తిన అప్పులు ప్రజలకు తిప్పలు. నీ మనుమడు, నా మనుమడు ఒక్కటే అని కేసీఆర్ అన్నడు సన్న బియ్యం ఇవ్వలేదని అన్నాడు.
రేవంత్ రెడ్డి వచ్చాక సన్న బియ్యం ఇచ్చాడని, Brs ను బీజేపీ కాపాడుతుందని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. Brs స్కామ్ లపై విచారణ చేయకుండా ఈడీ ని బీజేపీ అడ్డుకుంటుందని సామరామ్మోహన్ రెడ్డి తెలిపారు. కులాలను మతాలను అణచి వేస్తున్న భావజాలాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంటుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బ్రేక్ పాస్ట్, నిరుద్యోగుల విజ్ఞప్తి నేను స్వయంగా విన్నానని అన్నారు. SIPB లో ఏజ్ రిలాక్స్ అడిగారని, వెంటనే ఏజ్ రిలాక్స్ ఇప్పించానని గుర్తు చేశారు. సురభి వాణి దేవి గెలిచాక ఎక్కడ కనిపించలేదని అన్నారు.