టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘హనుమాన్’ మూవీ యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ కలెక్షన్స్‌లో ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఇది అద్భుత నిర్ణయమని, అయోధ్య రామమందిర నిర్మాణ చరిత్రాత్మమని, ఈనెల 22న ఆయన కుటుంబసమేతంగా అయోధ్యకు వెళ్తున్నట్లు తెలిపారు.