రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ, హరియాణా ఉన్నాయి. 2023లో రాష్ట్రంలో సైబర్ నేరాలను పరిశీలిస్తే ప్రతి లక్ష మందికి 261 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విషయం ఐ4సీ సీఈవో రాజేశ్‌కుమార్ ఇటీవల వెల్లడించిన 2023 వార్షిక నివేదికలో పొందుపరిచారు.