కీర్తి సురేష్ సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో కొన్ని బౌండరీస్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ (Keerthy Suresh) సినిమాలంటే ఆ సినిమాలో ఎలాంటి బోల్డ్ సీన్స్ ఉండవు అనే అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది కానీ తాజాగా కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డోరతీ’ (Dorothy). ఈ సినిమా ఇటీవల తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాకు నిరసన సెగ తగులుతోంది.
ఇలా ఈ సినిమా పట్ల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన ఇంటిమేట్ సన్నివేశాలు అని చెప్పాలి. ఊహించని విధంగా కీర్తి సురేష్ ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో LGBTQ ( స్వలింగ సంపర్కం) వంటి సన్నివేశాలు ఉండటంతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇద్దరు మగాళ్ళ మధ్య ప్రేమ కథను చూపించడంతో విమర్శలు రావడమే కాకుండా ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి కీర్తి సురేష్ ఇలాంటి పాత్రలో నటించడంతో ఆ ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు.
ఈ సినిమా 1990 ల కాలంలో మధురై నేపథ్యంలో సాగే సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో కుల వ్యవక్ష, హింస పురుషాధిక్యత సమాజం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో రిషికాంత్ ,సనంత్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇలా ఈ ఇద్దరితో కీర్తి సురేష్ ఇంటిమేట్, ముద్దు సన్నివేశాలు పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని మలేషియాలో బ్యాన్ చేశారు. ఇలాంటి సినిమాల ద్వారా తమిళ సంస్కృతిని సాంప్రదాయాలను మంట కలుపుతున్నారని వెంటనే ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.
ఇలా తమిళంలో ఈ సినిమాకు పెద్ద ఎత్తున నెగిటివిటీ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తేదీ తెలుగులో విడుదల కాబోతుంది ఏపీ తెలంగాణలో స్పిరిట్ మీడియా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించిన సంగతి తెలిసిందే. తమిళ తమిళంలో పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఉన్న ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి ఆదరణ లభిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.