తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల షెడ్యూల్ పై బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా షెడ్యూల్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపింది. దీని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలని భావిస్తోంది. ఈ లేఖ గురించి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, హైకోర్టు న్యాయమూర్తి భరత్ తో చర్చిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. ఆరు స్థానాల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు అయిన పాడి కౌశిక్ రెడ్డి హుజారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలుపొందారు.
ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఈ నాలుగు స్థానాలు ఖాళీ కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ప్రస్తుతం బలాలు బట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో స్థానం దక్కే అవకాశం ఉంది. ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు.
ఒకే రోజున ఒకే నోటిఫికేషన్ ద్వారా కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి MLCలుగా ఎన్నికైయ్యారని వినోద్ గుర్తు చేశారు. కానీ ఈ ఇద్దరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు వేర్వేరుగా షెడ్యూల్ ఇవ్వడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. గతంలో ఢిల్లీ, తమిళనాడులో అలానే చేశారని వినోద్ రావు పేర్కొన్నారు.