బుల్‌బుల్ తుపాను తీరం దాటింది. పశ్చిమ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఈ తుపాను గత రాత్రి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటినట్టు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. ఇక, తుపాను ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.