సోమవారం తెలంగాణ మంత్రివర్గం భేటీ…

సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. నెల రోజుల పాలన, ఆరు గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రజాపాలనలో అందిన ధరఖాస్తులు, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు 2023 డిసెంబర్ 9న కేబినెట్ భేటీ జరిగింది. సోమవారం రెండోసారి కేబినెట్ భేటీ కానుంది. మరోవైపు నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మేము సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తామని స్పష్ట చేశారు.

 

నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చిందని చెప్పారు. పెద్దవారికి పిల్లగాడిలాగా.. చిన్నవారికి రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు తీసుకెళ్తామని వివరించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అలాగే రైతు రుణ మాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

 

కేసీఆర్ గేమ్ మొదలు పెడితే పోటీ పడాల్సిందేనని అన్నారు. ప్రజాస్వామ్యంగా ముందుకెళ్తాని చెప్పారు. రాష్ట్ర పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *