గాల్లోనే ఊడిన విమానం డోర్.. మృత్యువు అంచుల్లోకి వెళ్లిన ప్రయాణికులు..!

171 ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్న విమానం గాల్లో ప్రయాణం చేస్తుండగా.. ఒక్కసారిగా దాని డోర్ ఊడిపోయింది. విమానంలో వేగంగా గాలి ఒత్తిడి రావడంతో ప్రయాణికులంతా ఏంటా చూడగా.. విమానం డోర్ ఊడి గాల్లో ఎగిరిపోయింది. అప్పుడు విమానం 16000 అడుగుల ఎత్తులో ఉంది.

 

అంత ఎత్తులో గాలి ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగా కొందరు ప్రయాణికుల ఫోన్లు గాల్లో ఎగిరిపోయాయి. ఒక పిల్లాడి ప్యాంటు చినిగిపోయింది. ఎగిరిపోయిన డోర్ ఎంట్రీ వద్ద ఒక సీటు ఊడి గాల్లోకి మాయమైంది. ఇదంతా చూసి ప్రయాణికులు భయంతో గజగజా వణికిపోయారు. వారందరికీ చావు దెగ్గర నుంచి కనిపించింది. ఈ ఘటన జనవరి 5 2024న జరిగింది.

 

అమెరికాలోని అలస్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన Boeing 737-9 MAX విమానం ఫ్లెట్ 1282 జనవరి 5, పోర్ట్ ల్యాండ్ నుంచి ఓంటారియాకు వెళ్లేందుకు బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కొంత సేపటికి విమానం ఎమర్జిన్సీ డోర్ ఊడిపోయింది. విమానం లోపలికి గాలి ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉన్న సీటు కూడా ఊడి గాల్లో ఎగిరిపోయింది. దీంతో విమానం లోపల ఉన్న ప్రయాణికుల ప్రాణాలు బిక్కు బిక్కు మంటూ కొట్టుకుంటున్నాయి. ప్రయాణికుల ఎదుటు ఆక్సిజన్ మాస్కులు వేలాడుతున్నాయి.

 

ఈ స్థితిలో విమానం నడుపుతున్న పైలట్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వెంటనే వచ్చిన దారి తిరిగి వెళ్లి సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.

 

అలస్కా ఎయిర్ లైన్స్ సంస్థ, విమాన తయారీ సంస్థ బోయింగ్.. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టాయి. ఎమర్జెన్సీ డోర్ ఎలా ఊడిపోయిందనేది త్వరలోనే తెలుసుకుంటామని వారు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *