అనంతసాగరం వైఎస్సార్‌సీపీకి బలమైన ప్రాంతం: మేకపాటి విక్రమ్‌రెడ్డి

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వైఎస్సార్‌సీపీకి ఎప్పటికీ బలమైన ప్రాంతమేనని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టకాలంలోనూ పనిచేసిన కార్యకర్తలే తమకు నిజమైన బలమని పేర్కొన్నారు.

అనంతసాగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి కార్యకర్త పార్టీ కోసం చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.

2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సుమారు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చినప్పటికీ, సీట్ల పరంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని విక్రమ్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.