నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భాద్రపద మాసం చవితి సందర్భంగా సోమవారం ఆలయ మండపంలో ప్రత్యేకంగా వినాయక చవితి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు.

ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆలయ సిబ్బంది, అధికారులు భక్తిశ్రద్ధలతో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.