ఏపీలో ఆసక్తి రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో రాజకీయ రగడతో.. ఏపీ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఎన్నికలకు 3 నెలల ముందే పరిస్థితి ఇలా ఉంటే.. కోడ్ వచ్చాక ఇంకెంత దుమారం రేగుతుందో అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మార్పులు, చేర్పులతో వైసీపీలో చీలికలు ఎప్పుడో మొదలయ్యాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలన్న ఆలోచనతో కీలక నేతలు సైతం.. పక్కపార్టీలకు చెక్కేస్తున్నారు.
ఇక టీడీపీలోనూ ఇప్పుడిప్పుడే అసమ్మతి రాగం వినిపిస్తోంది. పార్టీ నుంచి ముందుగా బయటకొచ్చేసేవారిలో ముందుగా వినిపించే పేరు.. ఎంపీ కేశినేని నాని. తిరువూరు సభకు రావొద్దని టీడీపీ చెప్పడంతో.. కేశినేని అలక పాన్పు ఎక్కారు. బాస్ ఏం చేప్తే అది చేస్తానన్న నాని.. వాళ్లకు ఇష్టం లేనప్పుడు పార్టీలో ఉండకపోవడమే మంచిదన్నారు. పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించేశారు. కానీ దానిపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ‘రా కదలి రా’ పేరుతో ఒకేరోజు 2 సభలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా ఆచంటలో రా సభలు జరగనున్నాయి. సభ బాధ్యతలు మొత్తం.. నాని సోదరుడు కేశినేని చిన్నికి చంద్రబాబు అప్పగించారు. తన అవసరం పార్టీకి లేనప్పుడు.. పార్టీలో ఉండకపోవడమే మంచిదన్నారు. రాజీనామా చేస్తానని కూడా ఇదివరకే కేశినేని నాని ప్రకటించారు. సభకు హాజరు కానని రెండురోజుల క్రితమే నాని తేల్చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో తిరువూరు సభకు వెళ్తారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.