క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.
ఆయన మాట్లాడుతూ.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాలో పాత్రల కోసం తాను ఏ హీరోను సెలెక్ట్ చేసుకున్నాడో కూడా తెలిపాడు.
తాను తెరకెక్కించబోయే మహాభారతం సినిమాలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే అర్జునుడి పాత్రకు రాంచరణ్, భీముడి పాత్రకు ఎన్టీఆర్, కర్ణుడి పాత్రకు పవన్ కళ్యాణ్, ధర్మరాజు పాత్రకు చిరంజీవిని తీసుకుంటానని అన్నాడు.
ఇక నకులుడుగా నాని, సహదేవుడుగా విజయ దేవరకొండ, దుర్యోధనుడుగా మోహన్ బాబులను ఎంపిక చేసుకుంటానని పేర్కొన్నాడు. దీంతో ప్రశాంత్ వర్మ మాటలకు ఈ హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్ హీరోల పేర్లు లేకపోవడంతో తమ తమ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. వీరిద్దరూ ఏం పాపం చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు.