యూపీలోని అయోధ్య విమానాశ్రయం పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అయోధ్యాధామ్’గా నామకరణం చేసింది. ఈ నిర్ణయానికి కాసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా.. విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని శ్రీరామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ రూపొందించారు.