దేశమంతా అయోధ్య రామయ్య స్మరణతో మారుమోగుతుంది. ఈ నెల 22న శ్రీరామచంద్రులవారి విగ్రహ ప్రతిష్ట, ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పరమపవిత్రమైన అయోధ్యలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేసుందుకు టీటీడీ సంసిద్ధం అయ్యింది. అయోధ్యకు తిరుమల లడ్డూలు పంపనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్ఫష్టం చేశారు.25 గ్రాముల బరువుగల లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించనున్నారు.