రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆదివారం విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రాత్రి 7.30 గంటలకు విందు ఉంటుందని పేర్కొన్నాయి. విందులో రాష్ట్రపతి దంపతులు, గవర్నర్ దంపతులతోపాటు మంత్రులు, నేతలు, అధికారులు పాల్గొంటారు. సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతకాల విడిది కోసం సతీసమేతంగా హైదరాబాద్ చేరుకున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయన ఉంటారు. రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ ఆదివారం విందు ఇస్తున్నారు. ప్రతీ ఏటా శీతకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్ వస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా విచ్చేశారు. దాదాపు 10 రోజులు హైదరాబాద్‌లో బసచేసి.. తర్వాత ఢిల్లీ తిరిగి వెళ్లిపోతారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )