టెస్టుల్లో ఒక్కసారి కూడా డకౌట్ కాని ఐదుగురు బ్యాటర్లు

టెస్టు క్రికెట్‌లో తొలి బంతి నుంచే నిలదొక్కుకోవడం బ్యాటర్లకు పెద్ద సవాల్. అయితే కెరీర్‌లో ఒక్కసారి కూడా డకౌట్ కాకుండా టెస్టు ప్రయాణాన్ని ముగించిన అరుదైన బ్యాటర్లు కొందరు ఉన్నారు. ఈ జాబితాలో జింబాబ్వే స్టార్ సీన్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు.

2013-2025 మధ్య జింబాబ్వే తరఫున 24 టెస్టులు ఆడిన సీన్ విలియమ్స్ 47 ఇన్నింగ్స్‌ల్లో 1,946 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజాలు జిమ్ బర్క్ 24 టెస్టుల్లో 1,280 పరుగులు, రెజ్జీ డఫ్ 22 టెస్టుల్లో 1,317 పరుగులు చేసి ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు.

భారత్ తరఫున బ్రిజేష్ పటేల్ ఈ అరుదైన రికార్డు సాధించారు. 21 టెస్టుల్లో 38 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆయన 972 పరుగులు చేశారు. వెస్టిండీస్ ఆటగాడు రాబర్ట్ క్రిస్టియాని కూడా 22 టెస్టుల్లో 37 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు.