ఆమనగల్ మండలం శెట్టిపల్లి గ్రామ ప్రజలందరికీ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో హృదయపూర్వక నమస్కారాలు. గ్రామ ఆడపడుచులు, మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే శెట్టిపల్లి బోనాల పండుగను సెప్టెంబర్ 7, 2026 సోమవారం రోజున గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్, తెల్గమల్ల జంగమ్మ వెంకటయ్య తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని, అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తిశ్రద్ధలతో జరిగే ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామంలో బోనాల పండుగను ఐకమత్యం, భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకుందామని తెలిపారు. గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు.