నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
తాజాగా చిత్రబృందం సెకండ్ సింగిల్ అప్డేట్ను ప్రకటించింది. ‘#YESHANAGULA’ (యెషనాగుల) పేరుతో రూపొందిన ఈ పాటను ఆగస్టు 29న విడుదల చేయనున్నట్లు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఊరమాస్ ట్రాక్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జంగి రెడ్డి, ప్రభ ఈ పాటను ఆలపించారు.
పాటకు సంబంధించిన చిన్న మ్యూజిక్ క్లిప్‌ను చిత్రబృందం విడుదల చేయడంతో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. క్లిప్‌లోని మాస్ బీట్ అభిమానులను ఆకట్టుకోవడంతో పూర్తి పాట కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 29న ‘యెషనాగుల’ పాట విడుదలతో ‘ది ప్యారడైజ్’పై అంచనాలు మరింత పెరగనున్నాయి.