రవితేజ ‘ఈగల్’ కి థియేటర్ కష్టాలు…

ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో రోజు రెండేసి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్‌గా సంక్రాంతి బరి నుంచి ఓ పెద్ద సినిమా తప్పుకుందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా ఎందుకు తప్పుకుందో తెలుసుకుందాం.

 

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఈగల్’. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం వాయిదా పడినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో అన్నీ భారీ అంచనాలున్న సినిమాలే. అందువల్ల ఏ సినిమా వెనక్కి తగ్గడం లేదు. దీంతో ‘ఈగల్’ నిమాకు థియేటర్లు కరువయ్యాయి. దీని వల్లనే ఈ చిత్రం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

 

ఎందుకంటే ఈ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయిందంట. ఇక బిజినెస్ కూడా వాళ్ళు అనుకున్నంత రేంజ్‌లో కాలేదని తెలుస్తోంది. దీంతో ఈ మూవీకి జరిగిన బిజినెస్‌కి.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ థియేటర్లు సరిపోవని భావించారట మేకర్స్. అందువల్లనే ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా ఈ వార్తతో ఫ్యాన్స్ నిరాశ చెందుతారని తెలిసి.. కొత్త రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. రవితేజ బర్త్ డే రోజున అంటే జనవరి 26న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *