సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ.45,000 జరిమాన

సిద్దిపేట పట్టణంలో ఎవరైనా చెట్లను గానీ, మొక్కలను గానీ నరికేసినా, ధ్వంసం చేసినా వారిపై శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. పట్టణాన్ని హరిత సిద్దిపేటగా మార్చడం మంత్రి హరీశ్ రావు లక్ష్యమని.. ఇందులో భాగంగా పట్టణంలోని అన్ని వార్డులు, ప్రధాన రహదారుల్లో మొక్కలను నాటి రోజూ నీరు పోసి సంరక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఈ ఘటన ద్వారా హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చెట్లకు ఇస్తున్న ప్రాధాన్యం హాట్ టాపిక్‌గా మారింది. ‘దటీజ్ హరీశ్ అన్న’ అంటూ అభిమానులు జేజేలు పలుకుతున్నారు. సదరు షాపింగ్ మాల్‌.. మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగానే ప్రారంభమైందని, తప్పు చేస్తే ఎలాంటి వారినైనా ఆయన వదిలిపెట్టరని గర్వంగా చెబుతుండటం గమనార్హం.శివమ్స్ గార్డెన్ సమీపంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు రోడ్డుపై ఏర్పాటు చేసిన హోర్డింగ్ కనిపించడం లేదని ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్లను నరికేయించారు. మునిసిపల్ ఛైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల అనుసారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ.45,000 జరిమాన విధించినట్లు ఆర్టికల్చర్ అధికారి ఐలయ్య తెలిపారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *