ఆ ఇద్దరు స్టార్లతో సినిమా తీస్తానన్న ‘యానిమల్’ మూవీ డైరెక్టర్..

రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీ మంచి హిట్ అందుకుంది. దాంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో కలిసి భవిష్యత్‌లో సినిమా చేసే ఆలోచన ఉందని తెలిపారు. ఆ ఇద్దరు స్టార్లకు తాను అభిమానినన్నారు. త్వరలో ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *