సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశాకు చెందిన గగన్ దాస్ అనే వ్యక్తి ఒడిశా నుంచి ఓ సంచిలో గంజాయిని తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి మొత్తం 8.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సీ టీమ్ ఎస్‌ఐ మంజు, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గగన్ దాస్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయిని ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.