కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కావేరీ నదీ జలాల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) జారీ చేసే ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

తమిళనాడుకు కావేరీ నీటి విడుదల విషయంలో CWMA ఆదేశాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇరురాష్ట్రాల మధ్య నీటి పంపిణీ విషయంలో అథారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

తమిళనాడుకు ఇప్పటివరకు విడుదల చేసిన నీటి పరిమాణం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి లభ్యత, వివిధ డ్యామ్‌లలో ఉన్న నీటి నిల్వలపై సమగ్ర స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.