డాక్టర్ జల్లి దినేష్‌కు ఉత్తమ సేవా పురస్కారం.. ప్రశంసించిన వైద్య ఆరోగ్య శాఖ

నెల్లూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చిల్లకూరు మండలం వలిపేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో వైద్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్ జల్లి దినేష్‌కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది.

ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందించడంతో పాటు విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు ఈ పురస్కారం అందించినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో డాక్టర్ దినేష్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వి. సుజాత చేతుల మీదుగా డాక్టర్ జల్లి దినేష్ ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను అధికారులు, సిబ్బంది అభినందించారు.