80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, విద్యార్థులు, కాలనీవాసులతో కలిసి ఎమ్మెల్యే జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశభక్తిని చాటుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
అనంతరం దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.