‘బావ’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ప్రణీత సుభాష్.. పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘అత్తారింటికి దారేది’లో ‘బాపు గారి బొమ్మ’గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. హీరోయిన్‌గానే కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2021లో బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత సుభాష్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చింది. దీంతో ఆమెను వెండితెరపై మళ్లీ ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రణీత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వారితో టచ్‌లో ఉంటోంది. దీంతో సినిమాల్లోకి ఆమె రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది.