నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుంకు అంతా సిద్దమయ్యారు. కరీంనగర్ ఇందిరాభవన్‌లో నిర్వహించిన నూతన సంవత్సర ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉత్సాహంగా గడిపారు.
అనంతరం క్యాడర్‌తో కలిసి కేక్ కట్ చేసి.. ఉత్సాహాంగా డ్యాన్స్ చేశారు. డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ అందరిని ఉత్సాహపరిచారు. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తేవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.