హైదారబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈనెల 4న మహాధర్నా చేపట్టనున్నట్లు ఆటో కార్మికులు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఆటో కార్మికులు సమావేశమయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 3న అన్ని బస్టాండ్లు, బస్ డిపోల ముందు భిక్షాటన చేస్తామని ప్రకటించారు. మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రతినెలా రూ.15వేలు జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.